Monday, September 16, 2019

యోగి కైయిన భోగి కైయిన...సాధనే మార్గం ...!!!

Monday, September 16, 2019

యోగి కైయిన భోగి కైయిన...సాధనే మార్గం ...!!!



యోగి కైయిన ..... భోగి కైయిన...సాధనే మార్గం ...!!! 

భయం లేని జీవితం చుక్కాని లేని పడవ వంటిది ......! 

భయం జీవితాన్ని అర్ధం చేసుకునేలా ఉంచాలిగాని 

భయం తో జీవిస్తే బ్రతుకంతా భారంగా, బ్రతకలేనంత 

బరువుగా మారుతుంది, బ్రతుకులో సారం మారుతుంది  

ఆపై సంసారం ఛిద్రమౌతుంది ...!

మరి తప్పంతా భయానిదా! అర్ధం చేసుకోలేని మనిషిదా..!! 

సాధనలేని జీవితం సాగుచేయని పొలం వంటిది యోగి 

కైనా భోగి కైనా పంట పండాలంటే సాధన 

చేయాల్సిందే, నమ్మకంతో సాధించాల్సిందే !! 

Sunday, September 08, 2019

అంతా మాయ, ఆ వింతే మాయ ... యోగి అయిన భోగి అయినా ...

అంతా మాయ, ఆ వింతే మాయ ...  యోగి అయిన భోగి అయినా ... 


అంతా  మాయ, ఉన్నది మాయ, విన్నది మాయ, అన్నది మాయ, కన్నది మాయ

నే ఉన్నది మాయ, నేనన్నది మాయ,  నాడన్నది మాయ, నీ ఉన్నది, అన్నదే  సత్యం !


జీవి జననం మాయతో, బ్రతుకు సమరం మాయం  మరణం మాయలో, 

ఎడారి లో ఎండమావి సత్యమైనట్లు,  జీవనపోరాటం  ఓ సత్యం  అన్నట్లు 

ఇది సత్యం, అది సత్యం అని వాదించేది అసత్యం, అదేమాయ, అర్ధం కాని మాయ 

ఉన్నదే మాయ, వద్దన్నా వద్దనే ఉండేదే మాయ, తెలిసినా మరిపించేదే మాయ!!


నీ భావనలో ఉన్న, నేనన్న భావుకతావు నువ్వు, నా లోనే ఉన్న నా ఆత్మవు నువ్వు 

ద్వైతం లో దాగి ఉన్న అద్వైతనివి నువ్వు , సత్య పరం జ్యోతి పరమాత్మవు నువ్వు !!